హైదరాబాదు వరసపేలుళ్ళలో ఇప్పటికి 42 మంది పోయారు. ఇంకా పోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళెంతమందో ! ఈ ప్రభుత్వానికి ఇంకొక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. ఏ టెర్రరిష్టు చర్యనీ అడ్డుకోలేని వొట్టి పోష్టుమార్టం గాళ్ళవల్ల దేశానికేంటి ప్రయోజనం ? కేంద్రంలో UPA, రాష్ట్రంలో కాంగ్రెస్సు అధికారంలోకొచ్చాక జనం టెర్రరిష్టుల బారిన పడి భారీగా సచ్చిపోతూండడం మామూలైపోయింది.
టెర్రరిష్టుల మీద చర్యలు తీసుకుంటే ముస్లిముల వోట్లెక్కడ పోతాయోనని వీళ్ళకి గుండెగుబులు. “ఇది బయటోళ్ళ పనే” అని చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఎవుడో మనకి అనవసరం. సచ్చింది మాత్రం మనోళ్ళే కదా ! అంటే ఇక్కడ లోకల్‌గా ఉండే ముస్లిములకి ఇందులో పాత్ర ఏమీ లేనట్లు బిల్డప్పులిస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పేలుడు పదార్థాల్ని దాచిపెట్టేవాళ్ళు, రవాణా చేసేవాళ్ళూ, టెర్రరిష్టులకి ఆశ్రయమిచ్చి అన్నం పెట్టేవాళ్ళు, పేలుళ్ళైపోయాక వాళ్ళని క్షేమంగా రాష్ట్ర సరిహద్దులు దాటించేవాళ్ళూ - ఇంతమంది లేకుండా పేలుళ్ళు ఎట్ల జరుగుతై ? ఓ చిన్న బుడ్డోడిక్కూడా తెలిసిన విషయం ఈ ప్రభుత్వానికి తెలవదా ? పాకిస్తాన్ ఇండియా మీద కక్ష గట్టిందంట. ISI ఏజంట్లని పంపిస్తా ఉందంట. ఎంత పాచిపోయిన పాతకతలు వినిపిస్తా ఉన్నారో ? పాకిస్తాన్ సంగతెలా ఉన్నా ఇక్కడ మన మధ్యనే పుట్టి మన మధ్యనే బతుకుతూ మన మీద కక్షగట్టిన ముస్లిములు కూడా ఉన్నారనేది ఎందుకంగీకరించరు ? హిందువులకి చెప్పే మతసామరస్యం పాఠాలూ మట్టీ మశానం ముస్లిములకెందుకు చెప్పరు ?
“ముస్లిములందరూ టెర్రరిష్టులు కారు, టెర్రరిష్టులు ఏ మతానికీ చెందరు” అని మాటికీ చెవికోసిన మేకల్లా అరిచే వీళ్ళు “టెర్రరిష్టు చర్యలకి పాల్పడే ఆ కొద్దిమందిని చట్టప్రకారం శిక్షించడంలో తప్పులే” దని ముస్లిములకి నచ్చజెప్పే ప్రయత్నం ఎందుకు చెయ్యరో మరి ? నాకు తెలిసి ముస్లిముల్లో అలాంటి అవేర్‌నెస్ క్యాంపెయిన్ ఎప్పుడూ జరగలే.
ఫలితం - బయటి టెర్రరిష్టులు మన ముస్లిముల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటిదేదైనా జరగ్గానే మన నాయకులు పడికట్టు పదాలతో స్టేట్‌మెంట్లు సిద్ధం చేసుకుని గడగడా ఒప్పజెబుతారు.
“మనది అహింసకు పుట్టినిల్లు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. జరిగింది చాలా దురదృష్టకరం.బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢసంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే దోషుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. హైదరాబాదు మతసామరస్యానికి పేరు మోసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా సమైక్యంగా సంయమనంతో వ్యవహరించాలి…”
ఎంత పాత పాటంటే చిన్నప్పట్నుంచి వినీ వినీ నాకు కంఠతా వచ్చేసింది. హైదరాబాదు మతసామరస్యానికి ప్రసిద్ధంట. ఏ తింగరోడన్నాడో ! ఈ సిటీకి మాత్రం అలాంటి క్లీన్ రికార్డెప్పుడూ లేదు. ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఇతర జిల్లాలకివ్వాలి ఆ కితాబు.
ఇంటలిజెన్సువాళ్ళేం చేస్తున్నారు ? అంటాయి పత్రికలు. అసలీ దేశంలో ఇంటలిజెన్సనేదొకటి ఏడ్చిందా ? ఎప్పుడూ అట్లనిపించలే. వాళ్ళకన్నా పత్రికలవాళ్ళే చురుగ్గా ఉన్నారు. అధికార పార్టీకున్న శత్రువుల గురించి ఆరా తియ్యడంలోను వాళ్ళ ఫోన్లు ట్యాప్ చెయ్యడంలోను ఇంటలిజెన్సువాళ్ళకి పుణ్యకాలం గడిచిపోతూండె. ఇక వాళ్ళు శాంతిభద్రతల గురించి పరిశోధించేదెప్పుడు ? వాళ్ళ బొంద.
కాంగ్రెస్‌కి-అందులోను శేఖర్ దాదాకి పరిపాలన చేతకాదని స్పష్టంగా తేలిపోయింది. నాయుడొస్తే పరిస్థితి కొంచెం ఇంప్రూవ్ అవ్వొచ్చు. కాని నాయుడు మాత్రం ముస్లిములతో గోక్కొవడానికి డేర్ చేస్తాడా ? అసలే 2004 సంవత్సరం ఎన్నికల నాటి గాయాలు ఇంకా నాక్కుంటా ఉంటే ! తన తొమ్మిదేళ్ళ హయాములో టెర్రరిష్టుల్ని బాగానే అదుపులో పెట్టినమాట నిజం. కాని ఓడిపోయాక మాత్రం ముస్లిముల వ్యతిరేకత వల్లే ఓడిపోయాననుకుంటా ఉన్నాడు. అంచాత ఆయన కూడా కాంగ్రెస్ బాటే పట్టి చూసీ చూడనట్లు పోయే అవకాశాలున్నాయ్.
మరి మనకేంది దారి ?…….గోదారే !