షిరిడీ సాయిబాబా హిందువే

2009 June 25
tags:
by అభిషేక్ చౌదరి
కొన్నాళ్ళ క్రితం తాడేపల్లిగారు తన బ్లాగులో “నిజమైన గురువు” అనే పేరుతో రెండు పోష్టులు రాసారు. వాట్లలో షిరిడీ సాయిబాబాగారిని డైరెక్టుగా కాకున్నా ఇన్ డైరెక్టుగా ముస్లిమేమో అని తోపించేటట్టు రెండు కథలు రాసారు. ముక్యంగా ఆయన గురువుగారి పేరు రోషన్ షాహ్ అనడం వల్ల శిష్యుడైన సాయిబాబాగారు కూడా ముస్లిమేననే అభిప్రాయం ప్రజల్లో కలుగుద్ది. కానీ ఆయన గురువుగారికి వెంకూసా అనే హిందూపేరు కూడా ఉన్నట్లు ఆయన చరిత్రలు చెబతా ఉన్నాయి. పత్తి నారాయణరావుగారు తెలుగులో రాసిన సాయిసచ్చరిత్రలో “సున్తీ చేసుకోమని ఆయన భక్తులకి చెప్పేవారనీ, కానీ తన మటికి సున్తీ చేయించుకోలే”దనీ రాసారు. ఆ ముక్క భక్తులకెలా తెలిసిందంటే, ఆయన ఇంకో యేడాదికి సమాధి అవుతారనంగా విజయదశమి రోజున సడన్ గా కోపం దెచ్చుకుని బట్టలిప్పేసి నిలబడి “ఇప్పుడు చెప్పండ్రా నేను హిందువునో ముస్లిమునో !” అని అరిచారంట. మరి బాబా నిజంగా ముస్లిమైతే చిన్నప్పుడే సున్తీ చేయించుకునుండాలిగా !

ఓసారి ఓ భక్తురాలు “బాబాకి ఇంతివ్వాలి” అని ముందనుకుని తరవాత తక్కువిచ్చిందంట. ఆయనకి అందరి మనసులో మాటా తెల్సు కాబట్టి “ఈ పేద బ్రామ్మణ్ణి మోసం చెయ్యొద్దు” అని నవ్వారంట. బాబాగారు ఒరిజినల్ గా ముస్లిమే అయితే “ఈ పేద ఫకీరుని” అనకుండా “ఈ పేద బ్రామ్మణ్ణి” అని ఎందుకన్నారు ? అదొక్కసారే గాదు, ఇంకోసారెప్పుడో భక్తులతో సీరియస్ గా మాట్లాడతా “ఈ సద్ బ్రామ్మడు మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెల్తాడు” అని అదే మాట రిపీట్ చేసారు.

ఆ మద్దెని ఇంకో దత్తచరిత్ర పుస్తకం చదివా. అందులో షిరిడీ సాయిబాబా ఆంజనేయస్వామి అవతారమని రాసారు. తను బరద్వాజ గోత్రంలో పుట్టి మహారాష్ట్రలో ఫకీరు రూపంలో ప్రసిద్ధి పొందుతానని ఆంజనేయస్వామి అన్నారంట. మరి బరద్వాజ గోత్రం ముస్లిముల్లో ఉండే ఛాన్సు లేదే !

ఎట్ల చూసుకున్నా బాబా ముస్లిము కాదు, హిందువే ! శ్రీకృష్ణుడు గొల్లవాడిలా లీలలు చెయ్యలా ? అట్లాంటిదే బాబా ఫకీరు వేషం కూడా !
 

10 Responses leave one →
  1. 2009 June 25

    ఒకవేళ ఆయన ముస్లిమో, క్రైస్తవుడో, యూదుడో అయితే నష్టం ఏమిటండీ? హిందువు కాకపోతే ఆయన గౌరవింపదగినవాడు కాకుండాపోతాడా? యోగులకు నిజ్జెంగా మతాలుంటాయా?

    ఇప్పుడు ఆయన పేరుతో కట్టబడుతున్న గుళ్ళూ, చేస్తున్న పూజలూ, దక్షిణలూ టెంకాయలూ హారతులూ వీటన్నిటినీ ఆయన అసహ్యించుకునేవారు తెలుసా? మరి అది ఏ మతపు లక్షణం?

  2. 2009 June 25

    ఇంతకూ మీ బ్లాగు ను నడిపిస్తున్న సాఫ్ట్‍వేర్ ఏమిటి? Wordpress కాదు. Is it movable type? Or Nucleus?

  3. 2009 June 25
    Anonymous permalink

    Brahamanudu ante baba vuddesyam lo matham gurinchi kadu. meeru okasari ’sri sai leelamrutham’–by ekkirala chadavandi.

    aina ikkada sai baba ni sadguruvu ga chudale thappa brahmin/muslim ani chudavaddu. ade kada Baba kuda chepparu.

  4. 2009 June 26
    Anonymous permalink

    ఎక్క డో చదివాను. నదులకు , సన్యాసులకు పుట్టుక ముఖ్యం కాదు అని. నాకు చాల నచ్చిన మాట.
    నదులు కూడా చూడండి. పుట్టిన చోట చిన్న గా కుంట లాగా ఉంటుంది. కాని అన్ని ఉపనదులు, ప్రవాహాలు కలిసి ఎంతో స్వచ్చం గా పవిత్రం గా అవుతుంది

  5. 2009 June 26
    Anonymous permalink

    మిత్రులకు మనవి

    మహాత్ములు సామాన్య లోకపు విషయాల కతీతులు .ముస్లిములే కాదు ,మరే ఇతరమతమైనా సనాతన ధర్మం లో అంతర్భాగమే,.భవిష్యపురాణం చూడ్ండి తెలుస్తుంది.మహాత్ములను గూర్చి మన జానాబెత్తల లెక్కలతో అంచనా వేయబూనటం పాపం .ఆపని జోలికి వెల్లకండి. మీ వుద్దేశ్యము లో ఏ దోషమూ లేదు అది తెలుస్తున్నది. కానీ మహాత్ముల విషయాలలో ఇలాంతి ప్రయతనమైనా మన పుణ్యరాశిని కరిగించి వేస్తుంది.అందుకని చెబుతున్నాను. ఏమీ అనుకోకండి. మీకిష్తమైతే వుంచండి లేకుంటే తొలగించండి ఈవ్యాఖ్యను ,మీకు కేవలం ఇది చెప్పలని మాత్రమే వ్రాస్తున్నాను.శుభం.పనిలో పని గురు పౌర్ణమి రాబోతుంది మీకిష్టమైన సద్గురు చరిత్ర ఏదైనా పరాయణం చేసుకోండి.
    దుర్గేశ్వర

  6. 2009 June 26
    Anonymous permalink

    మిత్రులకు మనవి

    మహాత్ములు సామాన్య లోకపు విషయాల కతీతులు .ముస్లిములే కాదు ,మరే ఇతరమతమైనా సనాతన ధర్మం లో అంతర్భాగమే,.భవిష్యపురాణం చూడ్ండి తెలుస్తుంది.మహాత్ములను గూర్చి మన జానాబెత్తల లెక్కలతో అంచనా వేయబూనటం పాపం .ఆపని జోలికి వెల్లకండి. మీ వుద్దేశ్యము లో ఏ దోషమూ లేదు అది తెలుస్తున్నది. కానీ మహాత్ముల విషయాలలో ఇలాంటి ప్రయత్నమైనా మన పుణ్యరాశిని కరిగించి వేస్తుంది.అందుకని చెబుతున్నాను. ఏమీ అనుకోకండి. మీకిష్టమైతే వుంచండి లేకుంటే తొలగించండి ఈవ్యాఖ్యను ,మీకు కేవలం ఇది చెప్పాలని మాత్రమే వ్రాస్తున్నాను.శుభం.పనిలో పని గురు పౌర్ణమి రాబోతుంది మీకిష్టమైన సద్గురు చరిత్ర ఏదైనా పారాయణం చేసుకోండి
    దుర్గేశ్వర

  7. 2009 June 26
    Anonymous permalink

    దుర్గేశ్వరగారూ ! నేను హిందువుని. నాకు బాబా హిందువుగానే కనిపిస్తున్నారు. ఆయన హిందువేననడానికి ఆయన చరిత్రలోంచి ఎన్ని సాక్ష్యాలైనా చూపించగలను. ఇప్పుడు బాబాని అందరూ పూజిస్తున్న పద్ధతి హిందూపద్ధతా ? ఇంకో పద్ధతా ? ఇప్పుడు బాబాని పూజిస్తున్నది ఏ మతస్థులు ? ఖచ్చితంగా చెప్పండి. మరి ఆయన హిందువేనని నేను రాస్తే నాకేదో కరిగిపోతుందనీ, తరిగిపోతుందనీ ఎట్లా అంటారు ?

    లెక్కలంటారూ ? జానా కావచ్చు, బెత్తా కావచ్చు, ఏ లెక్కలూ లేకుండానే జనం అవతార పురుషుల్ని అర్థం చేసుకుంటారా ? ఏదో ఒక రకంగా అర్థం చేసుకోకపోతే వారిని పూజించేదెట్లా ? ఎవడి స్థాయి నుంచి వాడు అర్థం చేసుకుంటాడు. తప్పేంది ?

  8. 2009 June 30
    Anonymous permalink

    mee mail adress okasaari pampamdi pani vunnadi meeto maatlaadaali.

    durgeswara@gmail.com

  9. 2009 September 5

    yes, either hindu or muslim yogi is yogi :guru is guru!when we are in lower levels we use these differences that too for our comforts as one sect of people have same ritual
    s of same sect.on the event of such rituals ,festivals&customs those people feel comfortble.In the presence n.v. meals,vegetarians feel some uneasiness .bithsides have inconvenience .but the sadguru is beyond all these earthly things.jagadguru Aadi sankaraachaarya himself told this thing.In my view Baba to bond unity between these two religions acted(behaved) like that
    neutral.Jai Baba!!

  10. 2009 September 5

    yes, either hindu or muslim yogi is yogi :guru is guru!when we are in lower levels we use these differences that too for our comforts .as one sect of people have same ritual
    s .on the event of such rituals ,festivals&customs those people feel comfortble.In the presence n.v. meals,vegetarians feel some uneasiness .bithsides have inconvenience .but the sadguru is beyond all these earthly things.jagadguru Aadi sankaraachaarya himself told this thing.In my view Baba to bond unity between these two religions, acted(behaved) like that
    neutral.Jai Baba!!

Leave a Reply

Note: You can use basic XHTML in your comments. Your email address will never be published.

Subscribe to this comment feed via RSS