రేపు మన వంతు…?
బొంబాయిలో నార్త్ ఇండియన్సు విపరీతంగా డామినేట్ చేసేస్తున్నారని కుర్ర ఠాకరే ఒకాయన గగ్గోలు పెడతన్నాడు. ఆయనకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అని ఒక సొంత పార్టీ ఉంది. అది పెద్ద ఠాకరేగారి శివసేనకి పుట్టిన కుర్ర శివసేన. రెండు పార్టీల అజండా ఒకిటే. మరాఠీ ప్రజల బాగోగులు. కుర్ర ఠాకరే గగ్గోలెనక చానా గొడవుంది. బొంబాయిలోనే కాదు మహారాష్ట్రలో యాడికి పోయినా హిందీవాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. ఇది వాస్తవం. వాళ్ళ సంఖ్య లోకల్ మరాఠీల సంఖ్యతో పోలిస్తే తక్కువే గాని జాతీయభాష పేరుతో వాళ్ళు చెలాయించే రౌడీయిజం జులుం మాత్రం భరించ సెక్యం కాకుండా ఉంది. ఈ దేశానికంతా కలిపి హిందీవాళ్ళొక్కళ్ళే చట్టబద్ధమైన ప్రథమ తరగతి పౌరులైనట్టూ మనమంతా ఎక్కణ్ణుంచో వచ్చి సరైన వీసాలూ పాస్‌పోర్టులూ లేకుండా ఇండియాలో జొరబడ్డ అక్రమ జనాభా అయినట్లూ వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూస్తే నాకేడనో కాలిపోద్ది.
నా మటుకు నేను ఠాకరే వ్యవహారం ఏదో రాజకీయం అని మాత్రం అనుకోవడం ల్యా. నిజంగానే అతను చెబుతున్న సమస్యలన్నీ హిందీవాళ్ళతో మరాఠీ ప్రజలు ఎదుర్కుంటా ఉన్న మాట వాస్తవం. అణుమాత్రమైనా అతిశయోక్తి లేదు. యాణ్ణుంచో వచ్చి తిష్టేసిన హిందీవాళ్ళలో రెండో జనరేషను పిల్లకాయలు ఒక్క ముక్క మరాఠీ నేర్చుకోకుండా మహారాష్ట్ర లోకల్సుగా చెలామణీ అవుతూ మరాఠీ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలన్నీ కొట్టేస్తా ఉన్నమాట నిజం. బొంబాయిలో మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మరాఠీలు 10-15 శాతం కంటే లేరనేదీ నిజం. వాళ్ళ మూలంగానే మరాఠీ భాష అధికార భాషగా అమలుకాకుండా పోయిందనేదీ నిఖార్సైన నిజం.
ఈడ హైదరాబాదులో మన చరిత్ర కూడా అదే దారిలో నడస్తా ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన 20 జిల్లాలవాళ్ళకి ఈడ ఉద్యోగం సంపాదించే హక్కు లేదు. అలా మన తెలంగాణా సోదరులు ఏర్పాటు చేశారు. ఫలితంగా మన ఉద్యోగాలన్నీ హైదరాబాదులో తిష్ఠేసిన హిందీవాళ్ళు కొట్టేస్తా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ లో వాళ్ళే సగం మంది ఉన్నారు. వాళ్ళంతా ఒక ముఠా. వాళ్ళందరూ ఏకమై తెలుగువాళ్ళని తొక్కేస్తా ఉంటారు. తెలుగు అధికారభాషగా అమలుకాకుండా మోకాలడ్డం పెడతా ఉంటారు. మనవాళ్ళూ ఒట్ఠి ఎదవలు. అవతలివాడు కాస్త తేడాగా కనపడంగానే ఎదవ నవ్వొకటి పులుముకుని వాడికంటే ముందే హిందీలో ఎత్తుకుంటారు సంభాషణ. మనమే హిందీలో మొదలుపెట్టేస్తూంటే వాడి బొంద ! వాడి జన్మకింక తెలుగెప్పుడు నేర్చుకుంటాడు ? వాడికి ఆ అవసరమే రాకుండా లేకుండా చేస్తున్నది మనమే గదా !
హిందీ రాష్ట్రాల్లో జనాభా చానా చానా ఎక్కువ. ఎంత ఎక్కువంటే యు.పి. వైశాల్యం ఏ.పి.వైశాల్యం కంటే తక్కువ. కాని దాని జనాభా 18 కోట్లు. అక్కడ ప్రభుత్వాలు ఉన్నా లేనివాటితో సమానం. అందుచేత ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఆ రాష్ట్రాలవాళ్ళు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పనెతుక్కుంటూ ఎల్తారు. అప్పుడే జరుగుతా ఉందంటే - ఎక్కడైనా అభివృద్ధి మొదలు కావడం ఆలస్యం, పొలోమని వేలుగా లక్షలుగా హిందీవాళ్ళొచ్చి వాలిపోతున్నారు. ముంబాయి అట్లనే అయింది. అస్సాం అట్లనే అయింది. మన హైదరాబాదూ అట్లనే అయింది. ఇప్పుడు విశాఖపట్నం అట్లనే అవుతా ఉంది. ఈ హిందీ జనతా నుంచి తప్పించుకునే మార్గమేందో అర్థం కాకుండా ఉంది. ఇట్ల చూస్తా ఉంటే కొంతకాలానికి మన రాష్ట్రంలో మనమే మైనారిటీలం, హిందీవాళ్ళు మెజారిటీ అయిపోతారేమోనని బయంగా ఉంది.
”మహారాష్ట్ర మరాఠీలదే” అనే వాదాన్ని నే సమర్థిస్తా. తప్పేంది ? లేకపోతే భాషాప్రయుక్తరాష్ట్రాలెందు కంట ? నాలిక గీసుకునేదానికా ? రాజ్యాంగమంటారా ? అదేమీ దైవసృష్టి కాదు. మనం రాసుకున్నదే. లోకల్ ప్రజల ఆకాంక్షల కనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటే తప్పేంది ?
అసలు రాష్ట్రాల పౌరసత్వం కూడా ఉండాల. ఆ పౌరసత్వాన్ని బయతోడు తీసుకోవాలంటే ఆ రాష్ట్రం భాష బాగా నేర్చుకుని ఉండాలని రూలు పెట్టాల రాజ్యాంగంలో !
మరాఠీలూ ! మీ పోరాటం కొనసాగించండి. మేమున్నాం మీ యెంట. మీరు మా తెలుగు బోర్డులు పీకేసినా సరే ! మేము బాధపడం. మీకా హక్కు సంపూర్ణంగా ఉంది.
అంటే మీ ఉద్దేశ్యం అర్హత వున్నా లేకున్నా స్థానికులకే అన్ని అవకాశాలూ ఇవ్వాలనా? భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ఎక్కడైనా నివసించే హక్కూ, ఎక్కడైనా ఉద్యోగం చేసే హక్కూ ఇచ్చిందని మీరూ మరచిపోయారా ఆ రాజ్ థాకరేతో పాటుగా? ఒక చిన్న ప్రశ్న. ఒక ప్రభుత్వరంగ సంస్థలో ఒక ఉద్యోగానికి డిగ్రీ చదివిన ఒక తెలివయిన నాన్లోకలూ అదే డిగ్రీ చదివిన శుధ్ధమొద్దయిన లోకలూ పోటీ పడ్డారనుకోండి. మీ సలహా ప్రకారం ఆ ఉద్యోగాన్ని లోకలుగారికి(వారికి ఓ అంటే ఢం రాకున్నా) ఇవ్వాల్సిందే. సూపరు.
నేనెందుకో మీ వాదనతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. మనందరం భారతీయులం అని చెప్పుకొంటూనే మనలో మనకు ఇన్ని భేదభావాలు, ఇంత అసహనం అవసరమా చెప్పండి. మరాఠీ రాని వారందరినీ మహారాష్ట్ర లోనుండి తరిమేయాలనుకోవడం మరీ అన్యాయం. స్థానికుల అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాలని అభిలషించడం మరీ దారుణం.
ఐనా ఇలా ఆలోచిస్తూ పోతే దీనికి అంతు వుండదు. ఇవ్వళ రాష్త్రాల గురించి మాట్లాడు కొంటున్నాం రేపు ఏవరో ఇదేవిధం గా జిల్లలగురించి ఆలోచిస్తారు. ఈ విఛ్ఛినకర భావజాలం (fissiparous tendencies)వల్ల అభివ్రుధ్ధి కుంటుపడటం మినహా మరేమీ జరగదు.
ఇక భాషా ప్రయుక్త రాష్ట్రాలంటారా… వాటి వెనకున్న వుద్దేశ్యం వేరు. ఏవరి భాషను వారు వ్రుద్ది చేసుకుంటూ భాషా సంస్కృతుల పరంగా సామీప్యం వున్న ఒక జాతి కలసి కట్టుగా వుండటానికి వుద్దేశించినవేగానీ, ఆపేరుతో ఇతరలు తన్ని తగలేయటానికి కాదు.
ఇతర దేశాలవారూ ఇలా సంకుచిత బుధ్ధితో ఆలొచిస్తే మనవాళ్ళు అక్కడ మనగలిగేవారా?
మీ వాదనను నేను పూర్తిగా సమర్దిస్తాను,
ఈ హైదరాబాదులో ఏ ఆటో వాణ్ణి పలకరించినా తెలుగు జాంతానై అంటాడు, కొన్నాళ్ళకి మనం హిండి నేర్చుకోవాలేమో అక్కడ బతకాలంటే.
మన తెలుగు దేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళని నీచంగా చూస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు తెలుగులో పేర్లుండవెందుకని.
బస్సుల బోర్డులపై తెలుగులోనే ఊళ్ళ పేర్లుండవెందుకని.
మన తెలుగును ఉద్ధరించడానికి మనకు రాజ్ ధాకరె లాంటి నాయకుడు కావాలి.
అందుకు మనలోనుంచే పుట్టుకు వస్తాడని ఎదురు చూస్తున్నాను.
మన యువత రాజ్ థాకరే లాగా ఆలోచించి మనం మన దేశాన్ని మరల ముక్కలు చేయటం ఖాయం.
అవునవును, మీకు అలాంటి నాయకుడు వద్దు.
రేపట్నుంచి దారిపక్కన మైలురాయి మీద ఎన్ని కిలోమీటర్లో హిండిలో చదువుకుందువుగాని
మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. కాని అన్ని ప్రాంతాలవారూ దర్శించే పుణ్యక్షేత్రాల దగ్గర మరాఠా బోర్డులు మాత్రమే వుండాలనటం కొంచెం అతి కిందకు వస్తుంది. ఆ ప్రాంతం అభివృద్ధికి అన్ని ప్రాంతాల వారు సహాయ పడ్డప్పుడు, వచ్చిన వారి సౌకర్యం కోసం వారి భాషలో కొన్ని బోర్డులు ఏర్పాటు చేస్తే తప్పేముంది. అక్కడ సెటిల్ అయినవారు ఆ భాష నేర్చుకోవాలన్న వాదన సరైనదే, కాని ఎప్పుడో ఒకసారి షిరిడీ సందర్శించటం కోసం మనం మరాఠా నేర్చుకోవాలా? పుణ్యక్షేత్రాల్లో మన భాషలో బోర్డులు లేకపోతే మధ్యవర్తుల మీద ఆధారపడి మోసపోయే అవకాశాలు ఎక్కువ.
“అవతలివాడు కాస్త తేడాగా కనపడంగానే ఎదవ నవ్వొకటి పులుముకుని వాడికంటే ముందే హిందీలో ఎత్తుకుంటారు సంభాషణ” - ఇది మాత్రం సరిగ్గా పేలింది.
I copletely agree with you. Look at any hindi channel or hindi cinema. They make fun of south indians. No Hindi channel includes news from south. I married a marathi girl. She used to ask “Why telugus do not invite north indians to there parties?”. I said in my mind there is long history of racisim between north indians and South indians. I told here that telugus don’t know much hindi and have different mindset. So they can not be close to north indians. What else I can say?
Madhu
Answer to Phani garu
Are we giving the governerment jobs to intellegent people these days.
it is the same whether it is a local non intellegent degree holder or the degree holder of the qouta system.
Our govt. doesn’t even give the highly sensitive or competetive jobs to competent and intellegent people, dependeng on where you live in India upto 70 % are not competent enough to do their jobs…
leaving it a side,,the writer touched a sensitive and burning topic ..
yes local people needs to be taken care..but the way you do it should not by force or at the cost of life and livelyhood of others living there for years and generations and contributed to the development.
yes all the employees should learn local language and the administration should be in local language. All the IAS and IPS people learn the language of their adopted state.
Hyderabad is sitting on a massive bomb, all you need is a tiny spark
rajesh
సరిగ్గ చెప్పినవన్నా నాదీ నీమాటే.
ఈ మద్యల ఏం రాస్తలేవన్న వారానికొక్కటన్నా రాయన్నా.
Imagine some other guy trying to kick you out of your home town only because of the reason that your forefathers don’t belong to the place and you don’t know the local language.
How the rights guaranted by the constitution?
We brag about our richness and veriety of our culture. What happens to our pride then.
Why should I be an Indian ratherthan representing my own state and her (so called local) people?
The language is rather petty a feeling to prop a feeling of this kind.
Interesting thoughts
ఆలోచించాల్సిన విషయాలే .. తమాషే ఏవిటంటే .. స్వాతంత్ర్యం రాకముందూ, వచ్చిన కొత్తల్లోనూ తెలుగు రచయితలు కొందరు ఇటువంటి కలల్నే కన్నారు .. ఇప్పుడు రాష్ట్రాలు గా ఉన్న ప్రాంతాలు స్వీయ పరిపాలన గల దేశాలు గా ఉండి పై లెవెల్లో భారతీయ ఫెడరేషన్ లాగా ఉండాలని.
- కొత్తపాళీ
Well said. I completely agree with you. I dont understand why people dont get it. North Indians are forcibly sticking Hindi to the rest of India. If you say you dont like to learn Hindi, then you are looked down like a traitor and someone who doesnt respect India. What the F does learning Hindi has to do with Patriotism? F Hindi. Learning Hindi doesnt get you anything. At least you get jobs by learning English and you get exposed to outer world. In Andhra Pradesh, they should completely ban Hindi as it is an uttely useless language. They should replace it with Yoga, Karate, Martial Arts, Swimming or any other usefull subjects like C and C++. Ditch Hidni and their big brother attitude. We dont have to put up with their attitude and learn their stupid language.
నేను రాసిందాన్ని విమర్శించే మిత్రుల కోసం మళ్ళీ రాస్తున్నా.
ఇక్కడ లోకల్ అంటే ఆ రాష్ట్రానికి చెందినవాడు. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ హక్కుల్ని హరించి పారెయ్యడం న్యాయమేనంటారా ?
ఆ మాత్రం దానికి స్వాతంత్ర్యం దేనికి ? బ్రిటీషువాళ్ళ పాలనే కమ్మగా ఉండేది గదా !
ముందు కొద్దిమంది బయటివాళ్ళు లోకల్ ఉద్యోగాలు కొట్టేసి తరువాత తమ డిపార్ట్‌మెంట్లలో సీనియర్లైపోయి ఆ తరువాత ఇంటర్‌వ్యూ బోర్డుల్లో మెంబర్లైపోయి లోకల్ వాళ్ళని పనిగట్టుకుని ప్రభుత్వోద్యోగాలకి దూరం చెయ్యడం సమంజసమేనంటారా ? ఇందులో merit ప్రసక్తేమీ లేదనే విషయం గుర్తిస్తారా ? లేదా ? చెప్పండి.
ఇండియా ఒక దేశమని ప్రచారమే తప్ప నిజంగా ప్రాక్టికల్‌గా ఇదొక దేశమేనా ? నానా దేశాల సమూహమా ? మీరే ఆలోచించండి.
ఆధికారిక స్థాయిలో బలవంతంగా హిందీ రుద్దితే లేని తప్పు స్థానికభాష నేర్చుకోనివాళ్ళని లేవగొడితే వస్తుందా ? అంటే బలవంతుడు తన భాషని ఇతరుల మీద రాజ్యాంగబద్ధంగా రుద్దొచ్చునన్నమాట. అలా రుద్దడం దేశభక్తి. అతని అన్యాయాన్ని అతని బలం justify చేస్తుందన్నమాట. వాడు మాత్రం స్థానికభాష నేర్చుకోవాలని మనం అడక్కూడదు. అలా అడగడం unofficial. కాబట్టి దేశద్రోహం. అయితే దీనికీ బ్రిటిష్ పాలనకీ ఏమిటి తేడా ? మరాఠీవాళ్ళు ఇందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే తెలుగువాళ్ళంగా మనం ఎందుకు సపోర్టు చెయ్యకూడదు ?
రాజ్యాంగంలో ఏ జాతికివ్వాల్సిన స్థానం ఆ జాతికి ఇవ్వకపోవడం వల్ల కాదూ ఈ గొడవలన్నీ ? అది మర్చిపోయి సంకుచితం గింకుచితం అని స్టేట్‌మెంట్లు ఇస్తే సరిపోతుందా ? ఈ దేశంలోని నాన్-హిందీ జాతుల భాషా-సంస్కృతుల్ని గౌరవించడానికి మనకు అడ్డొస్తున్న mental barrier ఏమిటి ? మనం నిజంగానే మన diversity ని గౌరవించే వాళ్ళమే అయితే ఆయా భాషలకీ సంస్కృతులకీ రాజ్యాంగబద్ధంగా ఒక unchallegeable position కల్పించి ఉండేవాళ్ళమే. కాని మనకు అలాంటి గౌరవభావమేదీ నిజంగా మన మనసుల్లో లేదు. అందుకని అలాంటి unchallengeable position ఈరోజు హిందీవాళ్ళకి మాత్రమే ఉంది. మిగతావాళ్ళంతా బ్రిటీషువాళ్ళ కాలంలో ఎలా ఉండేవారో ఇప్పుడూ అలాగే మిగిలిపోయారు. ఇదేనా నేషనలిజం అంటే ?
విశ్వ మానవుల్లా ఆలోచించాల్సిన ఈ రోజుల్లో ఇలా ఇరుకు మనస్తత్వాలు కలిగి వుండడం ఎంతో ఘోరంగా వుంది.ఇతర దేశాల్లో వున్న మన భారతీయుల్ని ఆయాదేశాలు ఆక్కడ్నుంచు తరలివెళ్ళండి అంటే…?
జాతి కుల మతల్లాంటి అడ్డుగోడలతో మానవులు ముక్కముక్కలయింది చాలదా? ఇంకా ఎన్ని గోడలు నిర్మించుకుని మనల్ని మనం ఇలా బంధించుకుంటాం.
మీ అభిప్రాయంతో నేను అస్సలు ఏకీభవించను. ఇలాంటి అభిప్రాయాల్ని నేను నూటికి నూరు శాతం ఖండిస్తున్నాను. ఇలాంటి అభిప్రాయాలను సపోర్ట్ చేసే వాళ్ళనూ కొంచెం ఆలోచించమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి రీజయనలిజమ్ మన ప్రగతికి పెద్ద అడ్డుగోడ. ఇవన్నీ కొంతమంది రాజకీయ నాయకుల తమ స్వప్రయోజనాల కోసం చేసిన సృష్టి.మేలుకోండి
అభిషేక్ గారూ,
మన తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసుకోవడానికి ఇంకెంతో దూరంలో లేం మనం.. సరిగ్గా ఇదే విషయాన్ని, అంటే, “లోకల్”, అనే పదానికి అర్ధం మార్చి చూడండి.. హైదరాబాద్ పరిష్థితి ఏంటొ…
తెలంగాణా వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు హైదరాబాద్ లో ఉండడానికి వీల్లేదని అంటే?? మనం అందరం తెలుగు వాళ్ళమైనా, మాట్లాడే తీరుని బట్టి ఏ ప్రాంతం వాళ్ళమో ఎలాగా తెలిసిపోతుంది…!!
మీ అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్నా
andaru peddalu baagane chepparu, kaani ikkada videsalalo vunna janalaki manam yemi cheppukovali desam gurinchi…? already north indians andaru oka group la kalasi vunnaru kalasi tirugutharu…ade manam maatram kottukuntunnam naaku telangana kaavali,rayalaseema,kosta ani…vadilesthe oko jilla oka state …. mundu manam sariga vunte vere vadimeeda padi kottukovacchu… telugulo samatha vundi kaani ikkada raayatam baaledu..manadi kadukkokunda ani.
Mundu manam yevaro telusukovali ippudu…Andhra ante Aravam vallega …antha vokate ane North indians ki telugu veru,tamil veru ani cheppali… tarvatha memantha vokkate ..maaku ee telangana rayalaseema kosta lantivi vaddu ani…tarvatha local non local gurinchi maatladocchu… ee madyalo telugu eppudo chachi swarganiki vellipoindi…
evarikaina churukkumante khsaminchandi… Telugu lo rayalani anukunnanu..kaani office lo kudaradu anduke anglam lo raasanu…
respeted
sir/madam.
I am m.kishore singh s/o;m.nandu singh
searching for governerment job
and my basic qualification is s.s.c from board of secondary
and I have 3 years expereance in sales and office assistant in pvtltd.
campany.
and expecting the positive responce from your side…
Thank`s
m.kishore singh
9346202934
You are so totally right (write!)