న్యాయానికి పూలదండలు !
ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ ఎన్నో ఎస్టేటో నాకు తెలవదు. మిగతా అన్ని ఎస్టేట్లూ భ్రష్టుపట్టిపోయినా న్యాయవ్యవస్థ అంతో ఇంతో సరింగా నడుస్తోంది కనక ఈ మాత్రం ఉన్నామని అనుకునేవాన్ని. కాని ఈ మధ్య జరిగిన సంఘటనలు చూశాక…..?
“ఆంధ్రా పి.సి.సి.మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు కొడుకు వెంకట్ నిరపరాధి”అని తేల్చేశారంట ఫోరెన్సిక్ వాళ్ళు. ఆ సచ్చిపోయిన ప్రశాంత్‌రెడ్డి ప్రపంచంలో ఇంక యాడా స్థలం లేనట్లు తనంతట తనే వెంకట్ ఇంటికెళ్ళి ఆడ కాల్చుకుని సచ్చిపోయాడంట. మనం నమ్మి తీరాల. ఎందుకంటే ఈ మాటలు ఫోరెన్సిక్ అనే శంఖంలో పోసిన తీర్థాలు కామట్టి. పాపం ! వాళ్ళీ ముక్క చెప్పడానికి - మన తెలంగాణా బిడ్డ కేశవరావు ఢిల్లీ వెళ్ళి తన ఇటలీ అమ్మని కలిసొచ్చేదాకా ఎందుకు వెయిట్ చేశారో !
కేసు ఇప్పటికీ జడ్జి దాకా వెళ్ళలేదు. కనక ఇది ఇంకా సబ్-జుడిస్ వ్యవహారం కాదు. కాబట్టి మన కంక్లూజన్స్‌కి మనం రావడంలో తప్పులేదనుకుంటా. అయితే జడ్జి దాకా వెళ్ళకుండానే కేసులు తేల్చిపారేస్తున్నారంటే-ఆహా ! ఆ కళానైపుణ్యం ఏమని వర్ణించను ! నిజంగా ప్రపంచంలో అన్ని హత్యలూ ఆత్మహత్యలే అయితే ఎంత బావుణ్ణు, మనకి CID, CBI లాంటి తెల్లేనుగులతో పనే ఉండదు.
ఇదివరలో ఇలాగే ఎన్నికల ముందు KCR మీద పెట్టిన కేసుల్ని ఎన్నికలయ్యాక కొట్టేశారు. ఎన్నికల ముందు మాన్య మంత్రులుగా ఉన్నవారు ఓడిపోయాక జైలుపాలయ్యారు. దీని భావమేమి తిరుమలేశా ! ఎన్నికల్లో గెలవగానే సడన్‌గా కోర్టులు వాళ్ళనెందుకు సచ్చరిత్రులుగా ప్రకటిస్తున్నాయి ? ఎవరు నేరస్థులు ? ఎవరు కారు ? ఆలోచిస్తా ఉంటే పిచ్చెక్కిపో్తా ఉంది. రాజకీయాలకీ న్యాయవ్యవస్థకీ ఏర్పడ్డ ఈ అక్రమసంబంధాల జబ్బు మన దేశంలోనే కాదంట. అమెరికాలో కూడా ఉందంట. భూషయ్యగారు అమెరికా సుప్రీమ్ కోర్టులో సీనియారిటీల్ని తొక్కిపెట్టి తనవాళ్ళందరినీ జడ్జిలుగా ప్రమోట్ చేశాడంట.
రాజకీయ నాయకుల విషయంలోనే కోర్టులిలా మొహమాటాలకి లోనవుతున్నాయా ? ఏమో మరి ! మా ఫ్రెండుకి ఒక ఆస్తి తగాదాలో అనుకూలంగా తీర్పు వచ్చాక ఫైనల్ ఆర్డర్స్ చేతిలో పెట్టడానికి అక్కడి “పెద్దమనిషి” అరవై వేలు లంచమడిగాడని తెలిస్తే మీరేమంటారు ?
పిచ్చెక్కడమేంటి…ఇప్పటికే జనాలందరూ పిచ్చివాళ్లయిపోయారు. వాడు చచ్చిపోతే వీడు సొమ్మసిల్లిపోవటం, తరువాత వాడి మీద ఏవేవో అభియోగాలు వెయ్యటం…ఆసుపత్రికి సుబ్బరంగా వచ్చి, అక్కడ పడిపోవటం…ఈల్లందరూ తాతల కాలంలో పుట్టుంటే ఏ అల్లూరి చేతిలోనో, భగత్ సింగు చేతిలోనో కుక్క చావు సచ్చే వాళ్లు..బతికిపోయారు వెధవలు
ఏంఉందీ ఆనటానికి- అసలు దేశం వదలకుండా ఉంటే ఇవన్నీ అలవాటైపోయేవికావచ్చు. ఇక్కడ(U.S) చాలా సంవత్సరాలున్నాక మాత్రుభూమికి తిరిగెళ్ళిపోవాలనే అలోచనని ఇలాంటి న్యూస్ విన్నప్పుడల్లా పూడ్చి పెట్టెయ్యాల్సొస్తోంది.భూషయ్యగారే కాస్త నయ్యం!
I admire your work,can you teach me how to write such a nice article