రాముడు అబద్ధం-రాజీవుడు నిజం…సీత అబద్ధం-సోనియా నిజం…
దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు వీడేంది ఈ టాపిక్ మీద ఇప్పుడు బ్లాగుతా ఉన్నాడు ? అనుకుంటున్నారా ? అదే మరి ! షాకులోంచి తేరుకోడానికి ఇంత టైమ్ పట్టింది. రాముడు అబద్ధమంట-రామాయణం అబద్ధమంట ! ఈ మాట నాస్తికులు ఎప్పట్నుంచో అంటనే ఉన్నారు. కాబట్టి అంత షాకైపోయ్యేదేం లేదు. షాకెందుకంటే ఆ ముక్క ఓ ప్రభుత్వం అనెయ్యడం వల్ల. ఇదే ప్రభుత్వం “ఖురాన్ అబద్ధం అల్లా అబద్ధం మహ్మదు అబద్ధం” అని కూడా అనుంటే నా బాధ చల్లారుండేది. అదే నోటితో మళ్ళా “బైబిలు అబద్ధం, ఏసుక్రీస్తు అబద్ధం, అబ్రహాం అబద్ధం, యెహోవా అబద్ధం” అనుంటే నేనీ టపా రాశేవాన్ని కాదు. అందరికీ మన హిందువులే దొరికారా కారుసవగ్గా ? అని నాకు యాడనో ఏ మూలనో కాలిన మాట నిజం. నాకు చెప్పకూడని చోట్ల కాలడం ఇది మొదటిసారి కాదు. ఇదివరలో మన దేవుళ్ళ బొమ్మల్ని తెల్లోళ్ళు వాళ్ళ బాత్‌రూముల్లో టైల్సుగా, చెప్పుల మీద డిజైన్స్‌గా వాడారని తెలిసినప్పుడు నాకు కత్తులూ కటార్లూ ఇంకా అనేక ఇతర ఆయుధాలూ గుర్తొచ్చిన మాట నిజం.
అలాగని నేనేం పెద్ద అదిరిపోయే లెవెల్లో రామభక్తుణ్ణీ కాదు. రోజూ ఇరగబడి పూజలు జేశేవాన్నీ కాదు. హిందూత్వ సపోర్టర్‌నీ కాదు. కాని నాకు బాధ కలిగింది ఈ వార్త విన్నాక. నాలో అనేక ప్రశ్నలు తలెత్తాయి.
చారిత్రిక ఆధారాలు లేవంట. దేనికున్నాయబ్బా చారిత్రిక ఆధారాలు ? గాంధి అనేవాడున్నాడని ఇప్పుడెవరైనా నిరూపించగలరా ? హిట్లరనేవాడున్నాడని నెపోలియన్ ఉన్నాడని ఇప్పుడెవరైనా నిరూపించగలరా ? ఇప్పుడు ఏ ఆధారం చూపించినా అది మన నమ్మకమే అవుతుంది తప్ప అది ఏ రకంగాను నిరూపణ కాదు. అటువంటప్పుడు వేలాది సంవత్సరాల కిందట జరిగిన విషయాన్ని ఇప్పుడు నిరూపించడం ఎట్ల సాధ్యం ? రామాయణమే కాదు, ప్రపంచంలో ఏ ఇతర ఇతిహాసమైనా అట్ల నిరూపించబడ్డ సందర్భమేదైనా ఉందా ? మరి రామాయణాన్నే ఎందుకు బోనెక్కించారు ? ఏ వుద్దేశంతో ఎక్కించారు ?
నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ వాళ్ళ ఇష్టం.”రాముడున్నాడని నమ్ము” అని మనం ఎవరినీ బలవంతం చెయ్యట్లేదే ? “రామాయణం నిజమని నమ్మా”లని మనం రోడ్డెక్కడం లేదే ? కాని అందరి సెంటిమెంట్లనీ దృష్టిలో పెట్టుకుని పరిపాలించాల్సిన ప్రభుత్వం తన అపనమ్మకాల్ని జాతి నెత్తిన రుద్దాలని ప్రయత్నించడమేంటి ? హిందువుల వోట్లతో గెలిచి హిందువుల్ని పరిపాలించే ఈ ప్రభుత్వానికి హిందువుల మతాన్నీ విశ్వాసాల్నీ గౌరవిస్తున్నట్టుగా కనీసం నటించే అవసరం కూడా ఎందుకు కనిపించట్లేదు ? దీని వెనక ఉన్న “విదేశీహస్తం” ఎవరిది ?
ఆ అఫిడవిట్టుని తరవాత ఉపసంహరించుకున్నారంట, సగం పెట్టి మేనత్తవన్నట్టు. అంతమాత్రాన వాళ్ళ పాపం కడుక్కుపోదు. వాళ్ళ ఉద్దేశాలు నగ్నంగా బైటపడ్డాయి. వాళ్ళు ఎవరి గురించి పనిచేస్తున్నారో వాళ్ళు ఈ జాతికి శత్రువులో మిత్రులో క్లియర్‌గా అర్థమైపోయింది.
అవును!
నేతల మాటలలో డొల్ల తెలిసిపోయినది. మీ అభిప్రాయం 100% నిజం. కాబట్టే హిందువులు తమ ఉనికిని కాపాడుకోవాలంటే ఓటుబ్యాంకును నిర్మించుకోవలసిన అవసరం ఉంది.
మనం ఏసుక్రీస్తును, మహమ్మద్ ను బాత్‌రూముల్లో టైల్సుగాను చెప్పుల మీద డిజైన్స్‌గాను వాడలేం.. అదే మన (అ)నాగరికత, గొప్పతనమూనూ. మనమూ అలా చేస్తే గాడిదకు గుర్రానికీ తేడా ఏముంటుంది చెప్పండి.
ప్రభుత్వం సెంటిమెంటు పాలిస్తుందా..నాకీ విషయం తెలియదు (భారతీయులందరూ కళ్ళు తెరిచి ఒప్పుకోవలసిన నిజాలు (ప్రభుత్వం != తల్లి), (ప్రభుత్వం != తండ్రి) (ప్రభుత్వం != అక్క) (ప్రభుత్వం != అన్న) (ప్రభుత్వం != గురువు) (ప్రభుత్వం != స్నేహితుడు)
మేడంతో గొడవపడిన అంబికా సోనీ కావాలనే ఈ పని చేయించిందని గాసిప్ నడుస్తోంది.
italian amma thappa evaru kanapadani ee dgulbjeelu vunnanthavarku manamu inka itlantivi chala choodalsi vasthundi, vinalsivasthundi
vasu